Posts

కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ 70 వ జయంతి

Image
 కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ గారి 70 వ జయంతి ------------ దేశం గర్వించదగ్గ తెలుగు శౌర్యం, రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి,  కిరాతక స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అత్యంత కిరాతకంగా ప్రాణాలు కోల్పోయిన సాహసి, అక్కడి గిరిజనుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ గారి 70 వ జయంతి సభలో - వారి స్ఫూర్తితో రచించిన "అటవీ వీరులార వందనం.." పాటను ఆలపించే అవకాశం దక్కింది. జోహార్ పందిళ్లపల్లి శ్రీనివాస్ జోహార్ జోహార్..!! నూజిళ్ళ శ్రీనివాస్ రాజమహేంద్రవరం ....

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

Image
  పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి.... *** ఏండి... బాన్నారా? బానే ఉండుంటారు లెండి... మీరు... మీ ఇల్లు... మీ పిల్లలు... మీ ఆస్తులు.. అన్నీ నిండుగా, సల్లగా ఉంటే సాలు కదండీ... సిన్ని నా బొజ్జకి శ్రీరామ రక్షా అని.. హాయిగా కాలు మీద కాలేసుకునో... నోట్లో ఏలేసుకునో గడిపెయ్యచ్చండి.... కుదిరితే ఒండుకుంటాం... లేదంటే స్విగ్గి లో పిజ్జానో... జోమాటో లో బర్గర్లో ఆర్డరిచ్చి ఆనక సుష్టుగా లాగించేయోచ్చు... మనకేటండి.. మానవ మారాజులం... మనం నేర్సుకున్న కోటి విద్యలు కూటి కొరకే... మనం నిత్యం పని చేసి చచ్చేది మన నోటి కొరకే... అబ్బే.. .మిమ్మల్నేం అనటం లేదండి... పెపంచం లో ఎనబై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు సేప్పేరు కదండీ... ఆ లచ్చలాది జీవరాశులలో ఏ సీకూ సింతా, బాదరబంది, బాదా గీదా లేకుండా బతికేత్తన్నది మనవే కదండీ... కానీ... మరి మనతో పాటు బూమి మీద నివసిస్తా మనకోసం ఎన్నో సేవలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేత్తా, మన మనుగడకే మూలం అయిన అనేక జీవులు ఉన్నాయి కదండీ... మరి ఆటి పరిస్థితి నేడు ఎలా ఉంటాందో ఎవన్నా ఆలోచించారాండి? ఉహూ... కుదరదు లెండి... మనవంత మన పెపంచంలో బిజీ బిజీ నిజానికి మన పక...

చెరగని కీర్తి, తరగని స్పూర్తి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ - Dr. Sarvepalli Radhakrishnan - Noojilla Srinivas

Image
  **చెరగని కీర్తి, తరగని స్పూర్తి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్** *** ప్రాచీన భారతదేశంలో, ఉపాధ్యాయులు లేదా గురువులు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. "గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు:, గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అనే ప్రాచీన గురుస్తుతి గురువుని సాక్షాత్తు ఆ త్రిమూర్తులతో సమానమైన దైవంగా భావించి పూజించడాన్ని తెలియజేస్తుంది. ప్రాచీన భారదేశంలో గురువులు కేవలం విద్యావేత్తలుగా మాత్రమే కాకుండా వారి శిష్యుల, విద్యార్థుల జీవితాలను సమగ్రంగా తీర్చిదిద్ది, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన మార్గదర్శకులుగా, తత్వవేత్తలుగా, మరియు ధార్మిక నేతలుగా గౌరవించబడ్డారు. భారతీయ సంస్కృతికి గురు-శిష్య సంప్రదాయం కేంద్రంగా నిలిచి గురువు నుండి విద్యార్థికి జ్ఞానం, భక్తి, సంస్కృతి, సంప్రదాయాలు బదిలీ కావడానికి తోడ్పడింది. రామాయణ కాలంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మహాభారత కాలంలో సాందీపని, ద్రోణాచార్యుడు, వేదవ్యాసుడు, ప్రాచీన చరిత్ర కాలంలో ఆదిశంకరులు, చాణక్యుడు, సమర్ధ రామదాసు మొదలైన వారు ఆదర్శవంతమైన గురువులుగా, ఉపాధ్యాయులుగా తమ గురుతర బాధ్యతలను నిర్వహించి ప్రపంచానికి ఆద...

ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు - Tributes to my Teachers - Noojilla Srinivas

Image
  * ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు* --------- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా ఎదుగుదలకు కారణమైన ఉపాధ్యాయులకు , నిరంతరం ప్రత్యక్షంగా , పరోక్షంగా ప్అంరేరణను రగిలించిన ఉపాధ్యాయులకు , గురువులకు పాదాభివందనాలు అర్పిస్తున్నాను. సుదీర్ఘంగా అనిపించినా... నా ఈ కృతజ్ఞతాంజలి ఎందరి వల్ల నేడు నేను కనీసం ఈ స్థితిలో ఉన్నానో గుర్తు చేసుకొనేందుకు నాకు నేను కల్అపించుకొంటున్న అవకాశంగా , అవసరంగా భావిస్తున్నాను. అందరికి మల్లే నాకు కూడా మా తల్లిదండ్రులే తొలి గురువులు... అందులోనూ లోకమందరి చేత ఆదర్శవంతమైన తెలుగు మాస్టారిగా, ఉభయ భాషా సాహిత్య వేత్తగా, పురాణ ప్రవచన కర్తగా, వేద పండితులుగా, ఆధునిక వాగ్గేయ కారునిగా పేరు గాంచిన మా నాన్నగారు శ్రీ నూజిళ్ళ లక్ష్మి నరసింహం గారి ప్రభావం మా అందరి మీద అధికం. కాని వారి దగ్గర ప్రత్యక్షంగా చదవలేకపోయిన లోటు అలానే ఉండిపోయింది. విద్యార్థి జీవితం ప్రారంభం ఎక్కడ ? అంటే ఏ పాఠశాలలో ప్రారంభం అయింది ? అంటే ఇప్పటికి నాకు సంశయమే... ఎందుకంటే అప్పటికే బ్లూ కాన్వెంట్ గా పిలవబడే రవీంద్ర విద్యా నికేతన్ లో జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి... దాన్ని స్థాపించిన శ్రీమతి కె. వరలక్...